వామ్మో: డీజే సినిమా బ్యూటీ అప్పుడే అంత డిమాండ్..!
అయితే ఇందులోని కొన్ని కమిట్మెంట్ అయిన సినిమాలు కూడా ఉన్నట్లు సమాచారం.. అయితే వాటి కోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటోందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే కేవలం ఒక సినిమా హిట్ తోనే నేహా శెట్టి తన కెరియర్ ను మంచి టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లే అని కనిపిస్తోంది. అయితే మొదటగా పూరి జగన్నాథ్ కొడుకు నటించిన మెహబూబ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించ లేకపోయింది ప్రేక్షకులను.
దీంతో డీజే టిల్లు అవకాశం రావడంతో ఈ సినిమాని ఒప్పుకొని తన నటనని ప్రూఫ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కథల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోయిన్లు శాలిని పాండే, రీతు వర్మ వంటి హీరోయిన్లు తమ సక్సెస్ తో రెమ్యూనరేషన్ విషయంలో మరింత డిమాండ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక ఇలాంటి తరుణంలో నేహా శెట్టి కూడా కూడా వీరితో పాటు సమానంగా రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు గా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ హీరోయిన్ అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇస్తారో లేక పక్కన పెడతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.