వామ్మో: భీమ్లానాయక్ మూవీ బుకింగ్ యూఎస్.. ఎలా ఉన్నాయంటే..?

Divya
పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమాని డైరెక్టర్ సాగర్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధం అయింది.. ఈ సినిమాని ఒకేసారి తెలుగులో పాటు హిందీలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. అయితే ఇప్పుడు యూఎస్ లో తాజాగా ఈ సినిమా టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యాయి వాటి గురించి చూద్దాం.

టికెట్ బుకింగ్ చేసిన రెండు ప్రదేశాలలో ఏకంగా కొన్ని గంటలకి 1067 టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం .. దీంతో 21350 డాలర్ల వరకు వచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమాపై ఎంత బజ్ ఉందో మనకి అర్థం అవుతోందని ట్రెండ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైన పుష్ప, అఖండ మూవీ లు కూడా మంచి వసూళ్లను ఓవర్సీస్ లో రాబట్టాయి. ఇక దీంతో అభిమానులు సైతం వాటిని మించి వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 100% ఆక్యుపెన్సీ లభించడం జరిగింది.. అంతే కాకుండా నైట్ కర్ఫ్యూ కూడా తీసివేయడం జరిగింది. దీంతో ఇక ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్.. రిటైర్డ్ అయిన హవల్దార్ మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా కొన్ని సన్నివేశాలను మార్పులు చేసినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్య మీనన్, రాణాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇక ఇతర పాత్రలు రావు రమేష్, సముద్రఖని, చిట్టి, రఘు బాబు తదితరులు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: