రాత్రంతా అమ్మాయితో సుడిగాలి సుదీర్.. షాకింగ్ కామెంట్స్?

praveen
సుడిగాలి సుదీర్ ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. జబర్దస్త్ లోకి సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టీం లీడర్ గా ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతేకాదు రష్మీ తో ఉన్న లవ్ ట్రాక్ కారణంగా బుల్లితెరపై అందరి మనసులను దగ్గరయ్యాడు సుడిగాలి సుధీర్. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెరపై హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.



 సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారిపోయిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత త్రీ మంకీస్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు గాలోడు.. కాలింగ్ సహస్ర అనే సినిమాలో నటిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఒకవైపు జబర్దస్త్ లో కమెడియన్గా చేస్తూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో యాంకర్ గా కూడా అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు సుడిగాలి సుదీర్ రాత్రంతా ఒక అమ్మాయి తో గడిపాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ వార్త రావడానికి కారణం జబర్దస్త్ ప్రోమో అని చెప్పాలి.


 అయితే జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ తనపై ఎలాంటి పంచ్ లు వేసుకోవడానికి అయినా రెడీ గా ఉంటాడు. అన్ని రకాల పంచ్ లను స్వీకరిస్తూ ఉంటాడు. ఇక ఇలా సుదీర్ పంచ్ లను స్వీకరించడం తోనే కామెడీ పడుతుంది అని చెప్పాలి. ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్  కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.  ఇక ఈ ప్రోమో లో భాగంగా నేను ఇచ్చిన 5000 ఏం చేశావు అంటూ అడుగుతాడు గెటప్ శ్రీను.. సుధీర్ రియాక్ట్ అవుతు అసలు మేటర్ చెప్పేయడంతో అంత షాక్ అవుతారు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా చాలా వర్షం వచ్చింది. తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటిదగ్గర వదిలేస్తే బాగోదు అని చెప్పి దగ్గర్లో ఉన్న ఒక హోటల్ రూం కి తీసుకెళ్ళి ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం అంటూ సుదీర్ చెప్పడంతో అక్కడున్న వారందరూ తెగ నవ్వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: