దేవుడా ఏంటిది.. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం?

praveen
సినిమా ఇండస్ట్రీ పై ఆ దేవుడు పగ బట్టాడా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయ్. ఎందుకంటే గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేసిన ప్రముఖులు అందరూ కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో కన్ను ముస్తూ ఉండటం అభిమానులందరినీ కూడా శోకసంద్రంలో ముంచేస్తుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎంతోమంది సింగర్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. గతంలో దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు


 దీంతో సంగీత ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది ఇక ఈ బాధ నుంచి తేరుకునేలోపే ఇటీవలే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇండస్ట్రీకి దూరం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. లతా మంగేష్కర్ మరణం తర్వాత ఆమె అభిమానులందరూ ఆమె జ్ఞాపకాల లోనే  ఉన్నారు. ఈ బాధ నుంచి బయట పడక ముందే మరో విషాదకర ఘటన సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు.



 హిందీతో పాటు తెలుగు భాషలో కూడా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు బప్పీలహరి. ఆయన పాటలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని జల్ పాయ్ గుడిలో 1953 నవంబర్ 27వ తేదీన జన్మించారు ఆయన. చిన్నప్పటి  నుంచి మ్యూజిక్ మీద మక్కువతో అటువైపు అడుగులు వేసి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. అంతే కాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలు డిస్కో మ్యూజిక్ ని పరిచయం చేసింది కూడా బప్పిలహరి అనే చెప్పాలి. ఇక తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలకు సంగీతం అందించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకర్షించారు ఆయన.. ఆయన మృతిపై ఎంతోమంది  సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: