ఈ ఏడాదిలో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కొన్ని మాత్రమే.. అందులో టిల్లు సినిమా బాక్సాఫిస్ వద్దు మంచి రికార్దులను అందుకుంది.. మంచి టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ను అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డిజే టిల్లు'. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాని తెరకెక్కించే సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 12న శనివారం రోజు థియెటర్లలో కి వచ్చి సందడి చేసింది. విదుదలైన మొదటి రోజు ఫస్ట్ షో కె హిట్ టాక్ ను అందుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరికి షాక్ ఇచ్చేలా ఘన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు వచ్చిన టీజర్, సాంగ్ జనాలను విపరీతంగా అలరించింది.ముఖ్యంగా యూత్ ను బాగా ఆకర్షించింది.సినిమా ప్రమోషన్స్ ని కూడా ఎక్కడా తగ్గకుండా భారీ సినిమా లెవల్లో చేశారు. అంతే విధంగా ఫుల్ కామెడీ తో సినిమా బాగా ఆకట్టుకుంటోంది.
సినిమా విడుదల అయిన రెండు రోజుల్లో అన్నీ ప్రాంతాల్లొ మంచి హిట్ టాక్ ను అందుకుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకున్న డీజే టిల్లు సిద్ధూ కేరీర్ లోనే ఇది ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని సినిమా వర్గాలు అంటున్నారు..బంగర్రాజు సినిమా విడుదల అయ్యి 50 కోట్ల వసూల్ చేసింది. ఇప్పుడు దాన్ని డీజె టిల్లు క్రాస్ చేసింది..ఈ వారం రిలీజ్ అయిన మిగతా సినిమాలు రెండో రోజుకే కలెక్షన్లు డ్రాప్ అయినా టిల్లు సినిమాకి వీకెండ్ పర్ఫెక్ట్ సినిమాగా ప్రేక్షకులను థియేటర్లకి వచ్చేసింది.. మొత్తానికి ఇది బెస్ట్ సినిమా గా నిలిచింది.