RRR హీరోయిన్ తో జతకట్టనున్న శివకార్తికేయన్..!!
ఇక ఈ ముద్దుగుమ్మ శివ కార్తికేయన్ నటించబోతున్న తన 20వ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివ కార్తికేయన్ అవకాశాలు ఉండడం గమనార్హం. ఇప్పుడు తాజాగా ప్రియాంక అరుల్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన డాన్ సినిమాను కూడా వేసవికాలంలో సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇదిలా ఉండగా తాజాగా శివకార్తికేయన్ తన 20వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలు జాతి రత్నాలు ఫేం అనుదీప్ తెరకెక్కిస్తున్నాడు.
ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. కారైకుడి లో పూజా కార్యక్రమాలు ముగించుకొని.. ఆ తర్వాత షూటింగ్ కోసం పాండిచ్చేరికి చేరనున్నట్లు సమాచారం.. పాండిచ్చేరిలో సెకండ్ షూటింగ్ కూడా పూర్తిచేసి ఫైనల్ షూటింగ్ కోసం లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిటిష్ యాక్టర్ ఒలివియా మోరీస్ కు ఈ సినిమాలో అవకాశం కల్పించినట్లు అధికారికంగా కూడా ప్రకటించడం గమనార్హం.