బ్రాండ్ అంబాసిడర్ గా మారిన యష్.. !!

Divya
కర్ణాటక సినీ ఇండస్ట్రీలో శాండిల్వుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పునీత్ రాజ్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ హీరోలలో యష్ ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇకపోతే స్టార్ హీరోలు తమ సినిమాలలో ఒకవైపు నటిస్తూనే ఆ ఇమేజ్ ను ఉపయోగించుకుంటూ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతోమంది వాణిజ్య ప్రకటనలు చేస్తూ సంవత్సరానికి కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యష్ కూడా మరొక వాణిజ్య ప్రకటన కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి బాధ్యతలు చేపట్టారు.
అదేదో కాదు సంస్కృతి, సాంప్రదాయ, ఆవిష్కరణల మరియు ఉత్పత్తుల సమ్మేళనంతో వస్త్ర పరిశ్రమ అయినటువంటి స్వదేశీ బ్రాండ్ రామ్ రాజ్ కాటన్ కి యష్ ను ఈరోజు పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. అయితే రామ్ రాజ్ కాటన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మొన్నటివరకు వెంకటేష్ , రాణా లు వ్యవహరించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా యష్ ను నియమించడం జరిగింది. ప్యూర్ కాటన్ తో దోథీలు , షర్టులు, ఇన్నర్ వేర్ లు , నైట్ వేర్ లు,  ఫ్యాబ్రిక్స్,  కిడ్స్ అలాగే ఉమెన్స్ వేర్ కూడా ఇందులో మనకు లభిస్తాయి.
ఇకపోతే తాజాగా రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు రామ్ రాజ్ తమ వ్యాపార రంగంలో సుమారుగా 50,000 కంటే ఎక్కువ నేత కుటుంబాలు ఈ బ్రాండ్ తో అనుసంధానించబడ్డాయి.. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పదివేలకు పైగా కుటుంబాలు ఉపాధి అవకాశాలు పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రాకింగ్ స్టార్ యష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు మేము గర్వపడుతున్నాము.. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి.. మా బ్రాండ్ కు  పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటారు అని మేము ఆకాంక్షిస్తున్నాము. ఇక ఈయన తన వంతు కృషిని చేసి స్వదేశీ వస్త్రాలను మరింత పబ్లిసిటీ చేయడంలో సఫలం పొందుతాడు అని అంటూ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: