భీమ్లానాయక్ మూవీ తో మరొకసారి వివాదంలో చిక్కుకున్న థమన్..!!
రానా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ కి.. డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవి ఈ నెలలో 25 వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ వేశారు చిత్రబృందం. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రానా పోషిస్తున్న పాత్రలకు సంబంధించి.. పలు టీజర్లు ,పోస్టర్లు ,పాటలు విడుదల కాగా వీటికి మంచి రెస్పాన్స్ లభించడం జరిగింది.. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమాలోని ఒక పాట విషయంలో కాపీరైట్ వివాదం బాగా పుంజుకుంటోంది.. ఈ సినిమాని మలయాళం నుంచి" అయ్యప్పన్ కోషియుమ్ "నుంచి తెలుగు లోకి రీమేక్ చేస్తున్నారు.
తెలుగు సినిమాలో మలయాళం సినిమాకు సంబంధించి ట్యూన్స్ ని ఉపయోగించారట.. కానీ ఆ క్రెడిట్ నిర్మాతలు జాక్స్ కి ఇవ్వలేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఇక ఇలాంటి నేపథ్యంలో ఆయన..IPRS లో ఫిర్యాదు చేయబోతున్నట్లు ఒక ఒక వార్త ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు కానీ, నిర్మాతలు కాని ఏ విధంగా స్పందించలేదు. ఇదివరకు కూడా ఇలాంటి ఇబ్బందులు రావడంతో వాటిని సమూహంగా పరిష్కరించు కోవడం జరిగింది.. ఇప్పుడు ఈ భీమానాయక్ మూవీ కూడా అదే జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్.