ఇప్పటికే ప్రభాస్ మరియు అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీగా హల్చల్ చేస్తున్నారు. వారి వారి సినిమాలతో ఎంతో గ్రాండ్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టి మంచి ఇమేజ్ సంపాదించిన వీరు ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరికొంత మంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మన హీరోలు చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు కావడంతో వారి వారి అభిమానులు భారీ స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్ లో వారు పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా పరిచయం కాబోతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మార్చి 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరిగాయి. అన్ని భాషలలోనూ జక్కన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ సినిమాకు భారీగా ఇమేజ్ తీసుకు వచ్చాడు కానీ కరోనా భారీ దెబ్బ వేసింది.
ఇంకోవైపు విజయ్ దేవరకొండ కూడా తన అప్ కమింగ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టే విధంగా సిద్ధం అవుతున్నాడు. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ సినిమా ఇటీవలే పూర్తి కాగా ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే ఇద్దరు హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ స్థాయిలో దూసుకుపోతున్న నేపథ్యం లో ఈ హీరోలు ఏ విధమైన స్థానంలో కొనసాగుతారో చూడాలి. తొందర్లోనే వీరి పాన్ ఇండియా భవిష్యత్తు తేలనుంది.