లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట!!

P.Nishanth Kumar
భారతరత్న, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఈరోజు పరమపదించిన విషయం అందరికీ తెలిసిందే. తన 92 వ యేటా ఆమె కరోనా బారిన పడడంతో జనవరి 8వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అలా ఆమె ఇన్ని రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు స్వర్గస్తులయ్యారు. ఆమె గాత్రం అమృతం లా ఉంటుంది అని చెప్పడానికి ఆమె పాడిన పాటలే నిదర్శనం. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించిన మెలోడీ క్వీన్ తెలుగు లో పాడితే చూడాలని చాలా మంది ప్రేక్షకులు అప్పట్లో ఎదురుచూసేవారు. ఆమె చేత పాటలు పాడించు కోవాలని కోరుకునే సంగీత దర్శకులు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు.

దాదాపు అన్ని భాషలలోనూ ఈమె పాటలు పాడింది. తన కెరియర్ లోనే ఇరవై ఆరు వేలకు పైగా పాటలు పాడిన వ్యక్తిగా నిలిచారు లతా. అయితే ఆమె పాడిన పాటలు ఎక్కువగా హిందీ లోనే ఉన్నాయి. తెలుగులో ఆమె కేవలం మూడంటే మూడు పాటలే పాడారని చెప్పవచ్చు. నిజంగా అది మన తెలుగు ప్రేక్షకుల దురదృష్టం అయితే ఆమె తెలుగులో ఎక్కువగా ఎందుకు పాడలేదో అనే విషయం పక్కన పెడితే ఆమె తెలుగులో పాడిన తొలి సినిమా ఏఎన్నార్ చిత్రం లోనిది కావడం విశేషం. ఏఎన్ఆర్ సావిత్రి జంటగా 1955 సంతానం చిత్రం లోని నిదురపోరా తమ్ముడా అనే పాట తెలుగులో పాడిన పాట.

ఆ తర్వాత ఆమెకు 10 సంవత్సరాలకు కానీ తెలుగు నుంచి పిలుపు రాలేదు. ఎన్టీఆర్ జమున నటించిన దొరికితే దొంగలు సినిమా లో ఆమె ఓ గీతాన్ని ఆలపించారు. ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆమెకు తెలుగులో పాట పాడే మరొక అవకాశం వచ్చింది.  నాగార్జున హీరోగా నటించిన ఆఖరి పోరాటం సినిమాలోని తెల్లచీరకు అనే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కలిసి పాడారు లతా. 2009 లో జైల్  సినిమా లోని ఆమె పాటే ఆఖరు. ఆ తరువాత తన సింగింగ్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: