గత నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం తెగ పాపులర్ అయింది. అయితే సౌత్ టు నార్త్ వరకు ఏ భాషలో అయినా హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు నిర్భయంగా తాము తమ కెరీర్లో ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెప్పడం జరిగింది. శ్రీ రెడ్డి వారి లాంటివారు అయితే మరి రచ్చ చేశారు.ఈమె కాకుండా సింగర్ చిన్మయి కూడా స్టార్ రైటర్ అయిన వైరిముత్తు తనతో మిస్ బిహేవ్ చేశాడంటూ ఓపెన్‌గానే చెప్పేసింది.ఇక తజాగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ కూడా సినిమా ఛాన్స్ కోసం గతంలో ఓ హీరోతో పాటు దర్శకనిర్మాతలు తనతో గడపాలని ఒత్తిడి చేశారని చాలా ఓపెన్ గా చెప్పింది.
అయితే ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుండో జరుగుతున్న వ్యవహారాలే. అయితే తాజాగా ఇప్పుడు వర్థమాన హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందట. ఇక ఇప్పటికే తనకే అచ్చ తెలుగు అమ్మాయి అనే ఒక ముద్ర కూడా ఉంది. ఇక తన మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా కమర్షియల్‌గా తను మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఈమె ఒక స్టార్ హీరో వారసులే పక్కన నటించింది.ఆమెకి అందం, అభినయం ఉండడంతో ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాలో కూడా ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. అయితే ఈమె సినిమాలే కాకుండా అందాల పోటీల్లో పాల్గొని అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
అయితే ఆమె రెండో సినిమాకే రు. 40 లక్షలు తీసుకున్న ఆమె.. ఇప్పుడు వరుస ఆఫర్లతో రు. 75 లక్షలు అడుగుతోందట. ఇక ఈమెకు సినిమా ఆఫర్ లో ఎక్కువగానే ఉన్నాయి అయినప్పటికీ బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేవాళ్లు ఎక్కువ అవుతున్నారట. అయితే ఈమెని చాలావరకు కమిట్మెంట్ మాత్రం ఇవ్వాల్సిందే అని మొహంమీదే అడిగేస్తున్నారట. అయితే ఈ విషయాన్ని తను సదరు కుర్ర హీరోయిన్ తన ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పుకుని బాధపడిందట. ఇక తాజాగా ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే ఇండస్ట్రీలో ఇవన్నీ తనకు తెలియనవి కావని.. ప్రతి సినిమాకు ఇలాంటి కమిట్మెంట్లా ? అని ఆమె చాలా బాధపడుతుందట...!!