తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ లతో కలిసి నటించిన హీరోయిన్ శ్రీప్రియ తమిళ అగ్ర హీరోల సరసన కూడా నటించింది. అంతేకాకుండా ఇమే అన్ని భాషలలో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది శ్రీప్రియ.. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో దృశ్యం సినిమా ని తెరకెక్కించింది ఈమె.. ఒక నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఈమె మొదటిసారిగా దృశ్యం సినిమాని తీసి సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు ప్రశంసల వర్షం దక్కింది.
ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉంటోంది ఈమె.. అయితే తాజాగా ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తన కూతురి స్నేహ పెళ్లి వివాహం త్వరలో జరగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అసలు విషయంలోకి వెళ్తే రాజ కుమార్, సేతు పలిని 1988 లో వివాహం చేసుకున్నది శ్రీప్రియ.ఇక వీరిరువురి కి ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి కూడా జన్మించారు.. ఇక అమ్మాయి పేరు స్నేహా కాగా..అబ్బాయి పేరు నాగార్జున. ఇక ఈమె కూతురు స్నేహ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో ఉన్నది.
అయితే ఈమె వివాహం త్వరలోనే జరగబోతోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అది కూడా ఈమె వివాహం రెండు చోట్ల చాలా గ్రాండ్ గా జరగబోతోందనే విషయం బాగా వైరల్ గా మారుతుంది. ఫిబ్రవరి 6వ తేదీన లండన్లో అన్మొల్ శర్మ అనే అబ్బాయి తో వివాహం జరగబోతోందని వార్త వినిపిస్తోంది.. అయితే మరొకసారి ఇండియాలో తమ బంధువుల, అతిథుల కోసం చెన్నైలో ఇండియన్ పద్ధతిలో మరొకసారి వివాహం జరగబోతోందని వార్త బాగా వినిపిస్తోంది. ఆ వివాహ వేడుక ఏప్రిల్.. మొదటి వారంలో ఉండబోతోంది అన్నట్లుగా కోలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ఈమె వివాహానికి చెన్నైలో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు కూడా.. హాజరు కాబోతున్నట్లు గా తెలుస్తోంది.