ఇదేందయ్య.. ఇదీ.. పుష్పరాజ్ శ్రీవల్లి పాటను ఇలా చేశావ్..?

Anilkumar
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా "చూపే బంగారమాయే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే" ఇదే పాట వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. టాప్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఈ సినిమాలోని పాటలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ సినిమాలోని పాటలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్, లుక్స్, పుష్పరాజ్ మేనరిజం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్,  డైలాగ్ లను తమదైన స్టైల్లో ఫాలో అవుతూ రద్దు చేస్తున్నారు నెటిజన్లు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలోని ఎంతో అందంగా సాగే శ్రీవల్లి పాటను జానపదంగా పాడితే ఎలా ఉంటుందో మీరు విన్నారా...?

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మీడియాలో కాశ్మీర్ కి చెందిన ఫోక్ సింగర్ శ్రీవల్లి పాటను తనదైన స్టైల్ లో పాడారు. హార్మోనియం వాయిస్తూ శ్రీవల్లి పాటను ఎంతో అందంగా జానపదం గొంతుతో ఆలపించాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ పాటను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు పాటపై సరదాగా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదేందయ్యా ఇది.. ఇది మేము చూడాలా.. అంటూ కొందరు 'శ్రీవల్లి పాట ఇలా కూడా పాడవచ్చా' అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు. ఇక బన్నీ ఫాన్స్ అయితే ఈ వీడియోని తెగ ఎంజాయ్ చేస్తూ పలు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: