వెంకటేష్ రానా లు ఎన్ని చేస్తారు?

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ లో ఉన్న ఇద్దరు అగ్ర హీరోల మధ్య సినిమా చూడాలని వారు ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. ఆ విధంగా దగ్గుబాటి అభిమానుల చిరకాల కోరిక వెంకటేష్ మరియు రానా కలిసి నటించాలని.వీరు కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎంతో ఆశ పడుతూ ఉన్నారు వీరు. అయితే గతంలో చాలాసార్లు చాలామంది దర్శకులు ఈ కాంబో కోసం ప్రయత్నాలు చేయగా అవి విఫలం అవుతూ వచ్చాయి. మంచి కథలు కూడా రాకపోవడం తో ఇది అలాగే ఉండిపోయింది. 

సినిమాల విషయంలో కొంతమంది దర్శకులు విఫలం అయ్యారు కానీ వెబ్ సిరీస్ లో విషయంలో కొంతమంది దర్శకులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వారిద్దరి కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హాలీవుడ్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం మూలంగా ఈ కథను తయారు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

అంతే కాదు ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సిద్ధం అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు కొంత మంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుండగా చివరికి ఆ సినిమాను సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన కొడుకు తన తమ్ముడు హీరో అయితే చాలా బాగుంటుందని భావించి వారికి సినిమా చూపించాడట. వారు కూడా ఈ చిత్రం బాగా ఉందని మెచ్చుకోవడంతో వీరు తొందర్లోనే ఈ సినిమా చేసే విధంగా ముందుకు పోతున్నారట. మరి ఈ చిత్రం మలయాళంలో సాధించిన హిట్ ఇక్కడ సాధిస్తుందా అనేది చూడాలి. తొందరలోనే దీని అధికారిక ప్రకటన రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: