రాబోయే ఆరు నెలలు మూవీ లవర్స్ కి పండగే పండగే?

Purushottham Vinay
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో డిజాస్టర్ టాక్ తోనే సెమీ హిట్ కొట్టి తన స్టార్ పవర్ నిలబెట్టుకున్నాడు. నెగటివిటీతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఈ ఏడాది మంచి హిట్ అందుకొని సోషల్ మీడియాలో పాటల పరంగా  మహేష్ యాక్టింగ్ పరంగా బాగా ట్రెండ్ అయ్యింది.రాబోయే జూన్ నుంచి వరుసగా ఆరు నెలలు  మిగిలిన టాలీవుడ్ టాప్ హీరోస్ అందరూ కూడా బ్యాక్ టూ బ్యాక్ నెలకి ఒకరు చొప్పున తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. మొదటిగా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే జులైలో నందమూరి నటసింహం బాలయ్య NBK109 మూవీ రిలీజ్ కానుంది.యుంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.ఇక ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో థియేటర్స్ లో సందడి చేయడానికి రాబోతున్నాడు. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.


సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అలాగే అక్టోబర్ 10న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక నవంబర్ నెలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయిన నవంబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ఖాయం అనే మాట బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాప్ సినిమాల లైన్ అప్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కూడా వచ్చింది. ఇక తాజాగా మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ టీజర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ పీరియాడికల్ జోనర్ మూవీగా హరిహరవీరమల్లు రాబోతోంది. ఈ సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు తాజా టీజర్ లో కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 20 వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: