హీరో వేణు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు వేణు తొట్టెంపూడి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఆయన సరైనా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైయ్యారు. వేణు స్వయంవరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా రాణించారు. ఇక ఆయన నటించిన సినిమాలన్నీ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వేణు ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వేణు తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని సినీ కెరీర్లో విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ఆయనకు ఉన్నట్టుండి అదే సమయంలోనే ఆఫర్లు రావడం క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. ఇక  తన నిజజీవితంలో ఇంజనీర్ కావాలనుకున్న వేణు సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారని అన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో  అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో తన భార్యతో కలిసి బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు వేణు.
అయితే 2001లో అనుపమ అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమె మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. ఇక ఆమె తన భర్తతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసింది. వేణు హీరోగా నటించిన చివరగా సినిమా రామాచారి. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో నటించారు. అయితే వేణు ఏవి పడితే ఆ పాత్రలో నటించడమే ఆయన కెరియర్ కు మైనస్ అయిందని ప్రభు చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీకి దూరమైన తరువాత వేణు రాజకీయాల్లోకి ప్రవేశించిన అక్కడ కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. వేణు తన సినీ జీవితంలో అవకాశాలను కోల్పోయి ఇండస్ట్రీకి దూరమైన తాజాగా రవితేజ నటిస్తున్న రామారావు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. వేణుకి సెకండ్ ఇన్నింగ్స్ అయినా కలిసి వస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: