ప్రభాస్ - బన్నీ మధ్య సోషల్ మీడియా వార్.. కారణం..?

Anilkumar
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్ లలో ఎవరు తగ్గరు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు. మా హీరో కి సరి లేరు ఎవరు అని అంటున్నారు. దేశంలోని అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫాన్స్. అయితే ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభాస్ బన్నీ ఫాన్స్ గొడవ పడడానికి కారణమవుతోంది. 

తాజాగా బన్నీ నటించిన పుష్ప మూవీ ఆయన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. నిజానికి పుష్ప సినిమా బన్నీ గత చిత్రం అలవైకుంటపురంలో కంటే భారీ వసూళ్లు ఏమి రాబట్టలేదు. కానీ పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. అలాగే బాలీవుడ్ లో ఈ సినిమా భారీ ఆదరణ దక్కించుకుంది. తెలుగులో కాస్త నష్టాలు మిగిల్చినా.. హిందీ లో మాత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అక్కడ దాదాపు 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే బన్నీ మొదటి సినిమా బాలీవుడ్లో ఫుల్ సక్సెస్ అవడంతో పాన్ ఇండియా స్టార్ లిస్టులో చేరిపోయాడు. ఇక టాలీవుడ్ నుంచి హిందీలో సక్సెస్ సాధించిన హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్ నిలిచారు.

అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వార్ కి దిగుతున్నారు. ఒకరిపై మరొకరు నెగిటివ్ కామెంట్ చేసుకోవడమే కాకుండా రకరకాల నెగిటివ్ టాక్స్ క్రియేట్ చేసి వాటిని ట్రెండ్ చేస్తున్నారు. అసలైన ఫ్యాన్ ఇండియా స్టార్ మా హీరో అంటే మా హీరో అంటూ కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు చిరంజీవి - బాలయ్య ఫ్యాన్స్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండేది. ఇద్దరి సినిమాలు విడుదలైతే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం నడిచింది. ఇక ఇప్పుడు మాత్రం ప్రభాస్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కొత్త ఫ్యాన్ వార్ మొదలైంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: