మెగా హీరోని కాదని.. ఆ హీరోతో షో చేయడానికి కారణలివేనా..??
ఇక నిర్మాత అల్లు అరవింద్ తలుచుకుంటే ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవితో కూడా హోస్ట్ గా చేయవచ్చు. అంతేకాదు.. అల్లు అరవింద్ బాలయ్యతో ఎందుకు ప్రొసీడ్ అయినట్లు.. అనే సందేహాలు ఇప్పటికీ మెగా అభిమానుల్లో తలెత్తున్నాయి. ఇక తాజా తాజాగా ఇంటర్వ్యూలు రైటర్ బి.వి.ఎస్.రవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన అన్ స్టాపబుల్ షో కి కూడా రైటర్ గా రాణిస్తున్నారు.
ఈ తరుణంలోనే రవి చిరంజీవి ని కాదని బాలయ్యతో ఈ టాక్ షో ఎందుకు చేయడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే అల్లు అరవింద్ అంటే ఓ కంపౌండ్ కి చెందిన వ్యక్తి కాదు.. ఆయనకి ఒక వ్యాపారం కాదు.. అందరితో చాలా బాగుంటారు.. అన్ని పనులు తానే స్వయంగా చూసుకుంటూ ఉంటాడు. అంతేకాదు.. అక్కినేని కుటుంబంతో కూడా ఎన్నో సినిమాలలో తెరకెక్కించారు. అయితే నందమూరి కుటుంబంతో వాళ్లకి 40 ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.
అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే.. బాలయ్య హోస్ట్ గా చేస్తే.. ఆ ఫ్లేవర్ వెరైటీగా ఉంటుందని మేకర్స్ భావించడంతో ఆయన కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకున్నారని వెల్లడించాడు. అంతేకాదు.. చిరంజీవికి ఈ షో స్టార్ కావడానికి ముందు అన్ని విషయాలు తెలుసు..ఇక అ షో కి ఎవరెవరు గెస్ట్ గా వస్తారో వాళ్ళు లిస్ట్ చిరంజీవి అడిగి తెలుసుకుంటారని చెప్పుకొచ్చాడు.