సమంత ముందు తేలిపోయిన తమన్నా!!

P.Nishanth Kumar
విడాకుల తర్వాత సమంత పనైపోయింది ఆమెకు సినిమా అవకాశాలు రావు ఇక కెరీర్ ముగించుకోవాల్సిందే అని ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ తట్టుకొని సమంత నిలబడగలిగింది అంటే ఆమె డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఆమె కెరియర్ ను మళ్లీ నిలబెట్టింది పుష్ప సినిమా లోని  ఐటమ్ సాంగ్ అని చెప్పవచ్చు. ఆమె ఐటం సాంగ్ చేసి ఉండకపోతే ఆమెకు ఇంత బజ్ రాకపోయేదే అని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయ్యింది.

అందులోనూ సూపర్ హిట్ అయిన ఇండియన్ సినిమా లలో పుష్ప నే నంబర్ వన్ కావడం అంతేకాదు ఐటెం సాంగ్ లో సమంత చేయడమే ఆమెకు ఇంతటి స్థాయిలో క్రేజ్ రావడానికి ముఖ్య కారణం. ఇక పుష్ప సినిమా ఇచ్చిన జోష్ లో సమంత వరస సినిమాలు ఒప్పుకొని మునుపటి వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె చేసిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె యశోద అనే మరి లేడీ ఓరియంటెడ్ సినిమా లో కూడా నటిస్తోంది. 

ఆమధ్య ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే కాదు బాలీవుడ్ లో కూడా ఓ ప్రాజెక్టులో నటిస్తోంది సమంత. ఈ విధంగా వరస ప్రాజెక్టులతో బిజీగా అవుతూ మళ్ళీ తన స్టార్ డం ను తెచుకునే ప్రయత్నాలలో పడింది సమంత. అయితే ఈమె ఐటెం సాంగ్ ముందు ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ ఐటెం సాంగ్ కూడా కనబడటం లేదు ప్రేక్షకులకు . ఆ విధంగా తమన్నా వరుణ్ తేజ్ హీరో గని చిత్రంలో చేసిన ఐటమ్ సాంగ్ కి ఏ మాత్రం కూడా ప్రేక్షకులకు ఎక్క లేదు. తమన్ సంగీతం అందించిన ఈ పాట పేలవంగా ఉండటం తో సమంత పాట మళ్ళీ అందరి నోళ్లలో నానుతోంది. ఎంతైనా సమంత చేసిన ఈ ఐటం సాంగ్ వేరే లెవెల్ అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: