ఒక్కవేళ అదే జరిగితే రామ్ గట్టేక్కిన్నట్లే..?

VUYYURU SUBHASH
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 2006లో వైవీఎస్ చౌదరి రూపొందించిన 'దేవదాసు' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇలియానా కూడా కొన్ని సంవత్సరాలు దేవదాస్ సినిమా ఇచ్చిన క్రేజ్ తో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది.
ఇక రామ్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు కొన్ని హిట్ సినిమాలు మాత్రమే దక్కించుకున్నాడు. రామ్ చేసిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఒంగోలు గిత్త మూవీ బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా..ఆ సినిమాలో రామ్ పర్ ఫామెన్స్ చూసి అందరు మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా..కొంత కాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న రామ్ కి పూరి జగన్నధ్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని విజయం అందించాడు.
ఇక రీసెంట్ గా ఆయన చేస్తున్న మరో మూవీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు చిత్ర బృందం. తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో రామ్  మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను  తమిళ తో పాటు తెలుగులోను రిలీజ్ చేసే విధంగా  తెరకెక్కిస్తున్నారు లింగుస్వామి. ది వారియర్ టైటిల్‏తో వస్తున్న ఈ మూవీలో లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. రీసెంట్ గానే  ఈ సినిమా టైటిల్‏ను, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో కూడా నాని తో రొమాన్స్ చేసిన్నట్లే కృతి హాట్ రొమాంటిక్ సన్నివేశాలల్లో నటించబోతున్నట్లు  టాక్ వినిపిస్తుంది. ఒక్కవేళ అదే నిజమైతే.. శ్యాం సింగ రాయ్ మూవీలాగే రామ్ ది వారియర్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలవ్వడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: