వారెవ్వా: నాగచైతన్యకి హీరోయిన్ గా - తల్లిగా నటించిన కథానాయిక ఎవరో తెలుసా..?
అయితే నాగచైతన్యకి రెండు పాత్రలో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ఆరు సంవత్సరాల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాను విడుదల చేసిన సంగతి అందరికి తెల్సిందే. అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించిన పాత్రలను బంగార్రాజు సినిమాలో కూడా కంటిన్యూ చేస్తూ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ తోపాటు నాగచైతన్య, కృతి శెట్టి కూడా కలిసి నటించారు.
అంతేకాదు.. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర చిన్నబంగార్రాజు మనవడిగా నటించారు. ఇక అసలు విషయానికి వస్తే.. రాము(నాగార్జున), సీత(లావణ్య త్రిపాఠి)ల కొడుకే ఈ చిన్నబంగార్రాజే నాగచైతన్య అన్నమాట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠి, నాగచైతన్య యుద్ధం శరణం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే మనం సినిమాలో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా నటించారు. బంగార్రాజు సినిమాలో వీరిద్దరూ కలిసి తల్లికొడుకులుగా నటించారు. ఇక ఇండస్ట్రీలో ఇప్పటివరకు మొదట హీరోయిన్ గా నటించి ఆ తర్వాత తల్లిగా నటించిన రికార్డు కూడా లావణ్యత్రిపాఠి సొంతం చేసుకుంది.