జనవరి 14తో నాగార్జునకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??
ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ జనవరి 14వ తేదీన తన తల్లి అక్కినేని అన్నపూర్ణ పుట్టినరోజు అని పేర్కొన్నారు. అంతేకాదు.. నాగార్జున తండ్రైన నాన్న అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలైనట్లు నాగార్జున తెలిపారు. అందుకే జనవరి 14వ తేదీన బంగార్రాజు సినిమాను విడుదల చేశామని నాగార్జున వెల్లడించారు.
అంతేకాదు.. అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన దసరా బుల్లోడు సినిమా కూడా సంక్రాంతికే విడుదలైందని నాగార్జున అన్నారు. ఇక డియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు సినిమాను తెరకెక్కించారని అన్నారు. అలాగే జీ స్టూడియోస్ తో ఉన్న ఒప్పందం వల్లే నాగార్జున సంక్రాంతి పండుగకు ఈ సినిమాను ఖచ్చితంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతంచర్చనీయంగా మారిన ఏపీ టికెట్ రేట్ల అంశం గురించి కూడా నాగార్జున మాట్లాడారు. అంతేకాదు.. సీఎం జగన్ ను కలవడానికి చిరంజీవి వెళ్లారంటే సమస్యకు హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనని నాగ్ అభిప్రాయం వెల్లడించారు. ఇండస్ట్రీ ప్రముఖులు ఆశించిన విధంగానే ఏపీలో టికెట్ రేట్లు ఫిక్స్ అవుతాయో లేదో చూడాలి మరి. అయితే ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా ఇతర రాష్ట్రాల స్థాయిలో మాత్రం పెరగడం అసాధ్యమనే నెటిజన్స్ అంటున్నారు. ఇక 2022 అక్కినేని కుటుంబానికి కలిసి వచ్చిందనే చెప్పాలి. 2021లో నాగార్జున ఇద్దరు కొడుకులు నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.