బంగార్రాజు : వాసి వాడి తస్సదియ్య..డైరెట్రూ నీ స్క్రిప్టు అదిరిందయ్యా?
ఒకవిధంగా ఈ క్యారెక్టర్ నాగ్ కోసమే పుట్టింది
బంగార్రాజు క్యారెక్టర్ కు సంబంధించి
ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో!
వాటినన్నింటినీ సరిగా అర్థం చేసుకుని
పాత్ర స్వరూప స్వభావాలు రీత్యా నటించి
మంచి పేరు తెచ్చుకున్నారు నాగార్జున
కథకూ,కథనానికీ మంచి అనుబంధం ఉంది.ఈ సినిమా ఆ అనుబంధాన్ని మరింత దగ్గర చేసింది. కథ కల్యాణ కృష్ణ రాశారు. కథనం సత్యానంద్ అందించారు.ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది.వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సిందే కానీ కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ పడుతూ వచ్చింది.అయినా కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఎటువంటి అంచనాలూ తగ్గలేదు.సినిమాకు సంబంధించి ఆశించిన ఫలితం మాత్రమే కాదు ఊహించని ఫలితం కూడా!
వాస్తవానికి సోగ్గాడే చిన్ని నాయన హిట్ తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చింది.ఈ గ్యాప్ లో నాగ చైతన్య కోసం ఓ సినిమా చేశాడు కల్యాణ్ కృష్ణ.రారండోయ్ వేడుక చూద్దాం అని సందడి చేశాడు. కానీ ఆ సినిమా మరీ అంత స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. తరువాత రవితేజతో నేలటికెట్ సినిమా తీశాడు.అది కూడా వర్కౌట్ కాలేదు.ఈ సారి తనదైన పంథాలో తనకు బాగా కలిసివచ్చి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ఓ స్వీకెల్ తీయాలని భావించి, కథ రాసుకున్నాడు.ఈ కథపై మొదట్నుంచి నమ్మకం ఉంచిన నాగార్జున సినిమా తీసేందుకు మాత్రం తొందరపడలేదు.డైరెక్టర్ సీన్లు రాసేందుకు మాత్రం చాలా టైం ఇచ్చారు.అదేవిధంగా ఆ రోజు ఆయన చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు.సొంత సోదరుడ్ని కోల్పోయి ఓ విధం అయిన విషాదంలో ఉన్నారు.సినిమా ఫీల్డ్ నే వదిలేద్దాం అని అనుకున్నారు.ఆఖరికి నాగ్ ప్రోత్సాహంతోనే ఈ సినిమా పట్టాలెక్కింది. మంచి సినిమాకు మంచి ఉదాహరణగా నిలిచింది.