అనసూయ.. మొదటిసారి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో కమెడియన్ సునీల్ పక్కన లా స్టూడెంట్ గా ప్రేక్షకులకు కనిపించింది.. కానీ అక్కడ ఎవరు కూడా ఈమెను ఏ మాత్రం గుర్తు పట్టలేకపోయారు.. ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానల్ లో న్యూస్ వ్యాఖ్యాతగా చేసిన తర్వాత ఈమె వాక్చాతుర్యం చూసి మల్లెమాల వారు ఈమెను సంప్రదించారు. ఎంబీఏ పూర్తి చేసుకున్న అనసూయ జబర్దస్త్ పై మొదటిసారి యాంకర్ గా చేయడానికి మల్లెమాల యూనిట్ వాళ్లకు ఓకే చెప్పింది.. దీంతో అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం నేడు పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి దోహదపడింది.
ఇకపోతే అనసూయ జబర్దస్త్ స్టేజ్ పైన యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఒకవైపు తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరొకవైపు అందాల ప్రదర్శన ఇస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.. యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినీ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక ఈమె ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయని గా నటించి మంచి ఇమేజ్ ను ఐతే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక అంతేకాదు పుష్ప రెండవ భాగంలో కూడా అనసూయ నటించబోతోంది.
తాజాగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే అనుసూయ తాజాగా లంగా ఓణీ లో పరువాల విందు చేస్తూ అందరినీ అలరిస్తూ వస్తోంది. గ్రీన్ కలర్ బ్లౌజ్.. ఎల్లో కలర్ లంగా తో గ్రీన్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఓణీ ధరించి చూసినవారు చూపు తిప్పుకోకుండా చేస్తోంది. అంతేకాదు ఈమెను ఇలా చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందాలు అద్దిన బుట్ట బొమ్మ అంటూ తెగ పొగిడేస్తున్నారు.