షాకింగ్: విడాకులపై స్పందించిన నాగ చైతన్య.. దానివల్లే..?!

N.ANJI

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ హీరో నాగచైతన్య-సమంత. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా, వార్తల్లో వీరి న్యూస్ హాట్ టాపిక్‌గా కనిపిస్తూనే ఉంది. ‘ఏం మాయ చేసావే’ సినిమా ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. నాలుగేళ్ల వరకు వీరి దాంపత్య జీవితం హాయిగా గడిచింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇటీవలే వీరిద్దరూ విడిపోయారు. అధికారికంగా విడాకుల ప్రకటన కూడా చేశారు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయం ఎవ్వరికీ తెలియదు.


అక్టోబర్ 2వ తేదీన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి అటు నాగ చైతన్య ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఎంతో బాధ పడ్డారు. ఎందుకు విడిపోతున్నారని, కలిస్తే బాగుటుందని భావించారు. కానీ వారిద్దరు విడిపోవడానికి ఫిక్స్ అయి విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. నాగ చైతన్య ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించగా.. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సమంత పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఈ సాంగ్ మంచి హిట్ అందుకోవడంతో.. బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనే విషయంపై దృష్టి సారించింది.


అయితే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటికీ.. విడిపోవడానికి గల కారణాలు ఎవరూ వెల్లడించలేదు. సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను బయట పెట్టినప్పటికీ.. నాగ చైతన్య మాత్రం ఈ విషయంపై స్పందిచలేదు. తాజాగా ఈ విషయంపై నాగ చైతన్య స్పందిచారు. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘విడిపోవాలనే నిర్ణయం మేమిద్దరం కలిసి తీసుకున్నాం. మా ఇద్దరి కోసం.. మంచి భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. విడిపోయిన తర్వాత సమంత, నేను ఎంతో సంతోషంగా మా జీవితాన్ని గడుపుతున్నాం. ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను. మరిన్నీ హిట్ మూవీస్ తీయాలని అనుకుంటున్నాను.’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, నాగచైతన్య విడాకులపై షాకింగ్ కామెంట్స్ ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: