రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన మహేష్ బాబు
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జక్కన్న. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదల కు సిద్ధంగా ఉంచాడు. అయితే ఆ సినిమా కాస్తా కరోనా కారణంగా పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి చిత్రం మహేష్ తోనే ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే గతంలో రామాయణం సినిమా చేయాలని మహేష్ బాబు రాముడిగా బాగుంటదని రాజమౌళి భావించగా దానిని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడట.
ఎందుకంటే ఒకవేళ ఆ సినిమా చేస్తే సమయం ఎక్కువగా తీసుకుంటుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా చేయడం సరి కాదని భావించి ఈ సినిమాకు నో చెప్పాడు మహేష్ బాబు. ఇప్పుడు చేయబోయే సినిమా ఏ జోనర్ లో ఉంటుంది అనేది చూడాలి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేల ఈ సినిమా ఉండబోతుంది అని అర్థం అవుతుంది. మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సర్కార్ వారి పాట అలాగే త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఇటు రాజమౌళి కూడా ఆర్.ఆర్.ఆర్ పనులను పూర్తి చేసి విడుదల చేసి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నం కానున్నాడు.