రష్మిక ఇలా పెంచేసిందేంటి?

Satvika
రష్మిక పేరు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపెసింది.. ఇప్పుడు చిన్న పొరగాడిని అడిగినా కూడా
రష్మిక పేరును చెబుతారు అంతగా ఫెమస్ అయ్యింది. ఛలో' సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' చిత్రాల తో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. మొన్నీమధ్య విడుదల అయ్యి సక్సెస్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.

తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చి భారీ సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రం లో నటించింది. పాన్ ఇండియన్ స్థాయి లో 5 భాషలలో విడుదలైన ఈసినిమాతో అన్నీ భాషలలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు రష్మిక రెమ్యునరేషన్ బాగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది.పుష్ప' చిత్రానికి రూ. కోట్ల వరకు అందుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు దాదాపు రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ అమ్మడు కు హీరో తో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చెస్తుంది. ఈ విషయం పై నిర్మాథలు ఏమి అంటారు అనేది తెలియాల్సి ఉంది.. రష్మిక సినిమలా విషయాన్నికొస్తే.. ఇప్పటికే రష్మిక హిందీ లో 'గుడ్‌బై', 'మిషన్ మజ్ను' చిత్రాలను పూర్తి చేసింది. తెలుగులో 'పుష్ప' సీక్వెల్, శర్వానంద్ సరసన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాలు చేస్తోంది.. ఇప్పుడు టాప్ హీరోయిన్ల లో ఎక్కువగా వినిపించే పేరు రష్మిక . వరుస సక్సెస్ సినిమాలలొ నటిస్తూ బిజిగా వుంది. ఇది ఇలా ఉండగా సోషల్‌మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాల గురించి షేర్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: