షాక్:తన వివాహం పై స్పందించిన స్టార్ హీరోయిన్..!!
తను ప్రేమిస్తున్న ఈ విషయాన్ని తనే స్వయంగా ఎలా చెప్పిందో తన వివాహాన్ని కూడా అలాగే చెప్తాను అని తెలియజేసింది.. మరీ ముఖ్యంగా మీడియాకు తన సమాచారాన్ని పంపిన తర్వాతే వివాహం చేసుకుంటానని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హీరోయిన్ చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు దయచేసి తన పెళ్లిపై రూమర్లు సృష్టించి తనకు ఇబ్బంది కలిగించవద్దు అంటూ కోరుకుంటుంది. ఇక ఈ సందర్భంలోనే తనకు తన బాయ్ ఫ్రెండ్ కు మధ్య ఉన్న కొన్ని విషయాలను కూడా బయట పెట్టడం జరిగింది.
జాకీ, తన ఒకేలా ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పవచ్చు.. ఇక తమ ఇరువురు కుటుంబాలు.. వీరిద్దరూ ఇచ్చే ప్రాధాన్యత ఒకేలా కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉదయం వీరిద్దరూ కలిసి జిమ్ వర్క్ ఔట్స్ చేయడానికి చాలా ఇష్టపడతారట.. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అందుచేత మేము బాగా కనెక్ట్ అయ్యాం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టంతా ఎక్కువగా సినిమాల వైపే ఉన్నదని.. హిందీలో కూడా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి అని తెలియజేసింది.