సమంత జోరు మామూలుగా లేదు బాబోయ్!!

P.Nishanth Kumar
విడాకుల తర్వాత సమంత తన సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోతుంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ ఆమెకు మంచి పేరును తీసుకురావడంతో పాటు పలు అవకాశాలను కూడా సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలోను శాకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా పూర్తి చేసి మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి కాగా రెండవ షెడ్యూల్ కూడా మొదలు పెట్టబోతున్న చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సమంత తన కెరీర్ మళ్లీ బిజీ చేసుకోవడానికి ఎంతో కష్టపడుతు ఉందని ఇప్పుడు చేస్తున్న సినిమాల వరుస బట్టి తెలుస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఆమె నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు పొంది ఇప్పుడు తన కెరియర్ ను చూసుకుంటూ సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడిందనే చెప్పాలి.

స్టార్ హీరోయిన్స్ ఎవరు కూడా చేయని విధంగా ఐటం సాంగులో చేసి సమంత తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయగా ఆ పాట చేసినదుకు ప్రతి ఫలంగా ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి అని చెప్పొచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా ఆమెకు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు రావడం విశేషం.  అల్లాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించే విధంగా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇదే ఊపును కొనసాగిస్తే తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుని మళ్లీ సినిమాలతో బిజీ అవడం గ్యారెంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఆమె ఆశించిన విధంగా తన తదుపరి సినిమాలతో సమంత పూర్వ వైభవం అందుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: