"ఆచార్య" మూవీ వాయిదా పడుతుందా ఏంటి?

VAMSI
చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ ఓకె స్క్రీన్ పై ఎక్కువ సేపు కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఇంతకు ముందు ఒకటి రెండు సినిమాలలో తళుక్కున మెరిసిన చిరంజీవి ఈ సారి పూర్తి స్థాయి పాత్రలో చేయనుండడం విశేషం. మొదటగా రామ్ చరణ్ పాత్ర ఒక అతిధి పాత్ర అనుకోగా ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పాత్రను పొడిగించారు. సామాజిక అంశాలను మేళవించి సినిమాలను తెరకెక్కించడంలో కొరటాలది ప్రత్యేకమైన శైలి. గత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. సినిమా మేకర్స్ నుండి ఇప్పటి వరకు వెలువడిన సమాచారం ప్రకారం ఆచార్య ఫిబ్రవరి 4 వ తేదీన రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి ఇంకా 20 రోజులకు పైగానే సమయం ఉంది. 

కానీ సినిమా రిలీజ్ కు ముందు చేసే ప్రమోషన్ కార్యక్రమాలే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కు ముందు ఎన్ని ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై సగటు ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. మరి ఎందుకు ఆచార్య టీమ్ ప్రమోషన్స్ విషయంలో వెనకడుగు వేస్తోంది అనేది అర్థం కాని ప్రశ్న. సినిమా కథ ఎంత బాగున్నా ప్రేక్షకులకు తెలియాలంటే ప్రమోషన్స్ అనేవి చాలా అవసరం. ఇప్పటి వరకు అయితే సినిమా నుండి సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అంతకు మించి ఎటువంటి అప్డేట్స్ రాలేదు అనే చెప్పాలి. కొరటాల శివ సినిమాపై ఎక్కువ నమ్మకంతో ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. అయినప్పటికీ ప్రమోషన్ చేయడం వలన ఇంకా ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. మరి హీరో మరియు నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ విషయంపై ఎలా ఆలోచిస్తున్నాడో తెలియడం లేదు.

ఇప్పటికే జనవరి సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన పెద్ద మూవీలు ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ లు థియేటర్ల సమస్య మరియు కరోనా థర్డ్ వేవ్ విజృంభణ వలన వాయిదా వేసుకున్నాయి. దీనితో ప్రేక్షకులు అంతా చాలా నిరాశ పడ్డారు. ఇంకా ఆచార్య రిలీజ్ కు సమయం ఉన్నా రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండడంతో వీళ్ళు కూడా వాయిదా వేసుకుంటారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. మరి వాస్తవం ఏమిటన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: