అయ్యో.. కొత్త డేట్స్‌ కూడా గందరగోళమేనా?

Satvika
గత ఏడాది 2021న కరొన కారణంగా సినిమా ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సినిమాల జోరు కూడా బాగా పెరిగింది. చిన్న హీరో ల నుంచి స్టార్ హీరోల వరకూ అందరూ కూడా వరుస సినిమాలలో నటిస్తున్నారు. 2022 సినిమాల జోరు పెరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఏడాది మొదట్లోనే డీలా పడింది.పాన్ ఇండియా టార్గెట్ తో బరిలో దూకుదామనుకున్న స్టార్ట్స్ కు మళ్ళీ బ్రేక్ పడేలా ఉందని తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో రూపొందిన ట్రిపుల్ ఆర్ సినిమా మంచి  
బోణీ కొట్టబోతుందనుకుంటే.. మిగిలిన మేకర్స్ కు సడెన్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రాల పరిస్థితి ఏంటి అని చిత్ర నిర్మాతలు సందిగ్దంలో ఉన్నారు. ఆ సినిమాలు విడుదల అవుతాయా? లేదా ? అన్నది ఆసక్థిగా మారింది.పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది థియేటర్స్ లో స్టార్ ప్రాజెక్ట్స్ తో పండుగ చేసుకోవాలనుకున్నారు ఫ్యాన్స్.

కానీ ఒమిక్రాన్ కారణంగా సినిమాల పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది.వాయిదాల పర్వం కొనసాగేలా కనిపిస్తోంది. కొవిడ్ ఆంక్షలతో రిలీజ్ డేట్స్, షూటింగ్స్ పోస్ట్ పోన్ అయితే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా ఉంటుంది.ట్రిపుల్ ఆర్ తో పాటుగా మిగిలిన పెద్ద సినిమాలు కూడా విడుదల అయితే మాత్రం ఇక సినిమాలు విడుదల అనేది అందని ద్రాక్షలా మారింది.ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ 1కి మారొచ్చనే హింట్స్ అందుతున్నాయి. అదే జరిగితే ఆ ప్లేస్ లో ఉన్న సర్కారు వారి పాట మళ్లీ కొత్త డేట్ వెతుక్కోక తప్పదు. ప్రభాస్ సినిమా తో పాటుగా ప్రతి సినిమా కూడా వాయిదా పడనున్నాయి. పరిస్థితి చూస్తూంటే సినిమాలు ఓటిటి లో విడుదల అయ్యేలా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: