నయన్- విగ్నేష్ : పెళ్లి కాకుండానే విచ్చలవిడిగా ఎంజాయ్...

Purushottham Vinay
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు పోటీగా దూసుకుపోతుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇక ఇదే సమయంలో ఈ హాట్ బ్యూటీ నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంది.ఇక నయన్ గత కొన్నాళ్లుగా కూడా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం కూడా తెల్సిందే. వీరి పెళ్లి అదుగో ఇదుగో అంటూ రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. పెళ్లి మాట ఏమో కాని ఇద్దరు కూడా కపుల్స్ మాదిరిగా లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో అయితే చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్ సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఈ విషయాన్ని ఖండించలేదు.. అలా అని నిజం కూడా అనడం లేదు.


ఇక విఘ్నేష్ శివన్ ఇంకా అలాగే తన ప్రేయసి నయనతార లు ఇద్దరు కూడా కలిసి సహజీవనం సాగిస్తున్నారు అనేందుకు చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ చెబుతున్న తమిళ మీడియా ఇప్పుడు దీన్ని కూడా ఒక సాక్ష్యంగా చూపుతున్నారు. ఇద్దరు ఇప్పుడు కాకున్నా ఇంకొన్ని సంవత్సరాలకైనా కాని పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం నయనతార హీరోయిన్ గా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఇక ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆమెకు ఆఫర్లు అనేవి తగ్గుతాయి. అందుకే ఈ హాట్ బ్యూటీ పెళ్లికి ముందు వరకు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈమద్య సంవత్సరానికి రెండు మూడు సినిమాలు లేదా అంతకు మించి కూడా కమిట్ అయ్యి చేస్తుంది. వచ్చే కొత్త సంవత్సరం వరకు అయినా వీరిద్దరు దంపతులుగా మారుతారేమో చూడాలని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడాలి ఇక మున్ముందు ఏమి జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: