ఆర్ ఆర్ ఆర్ తో సహా ఏప్రిల్ లో వచ్చే సినిమాలు!!

P.Nishanth Kumar
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం ఒక్కసారిగా అందరినీ ఎంతగానో నిరాశపరిచింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఒక వారం రోజులలోనే చూసి తరించి పోవాలని ప్రతి ఒక్క అభిమాని భావించగా రాత్రికి రాత్రి ఈ సినిమా విడుదల తేది మారిపోవడం సంక్రాంతికి విడుదల కావట్లేదు అని చెప్పడం ఒక్కసారిగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు. దాంతో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తారని చెబుతూ ఉండగా ఇంకా కొంతమంది ఈ సినిమా ను వేసవిలో విడుదల చేస్తేనే బాగుంటుంది అనే సూచన చేస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా వచ్చే వేసవి లో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. అప్పటికీ కరోనా ప్రభావం ప్రభావం ఏమీ లేకపోతే తప్పకుండా ఏప్రిల్లో సినిమాను విడుదల చేస్తారట. 

అయితే అప్పటికే ఏప్రిల్ లో విడుదల కాబోతున్న కొన్ని సినిమాలు ఈ సినిమా రాకపై కొంత అభ్యంతరం తెలుపుతాయని అనుమానాలు ఇప్పటినుంచే కొనసాగుతున్నాయి. ఏప్రిల్ లో కే జి ఎఫ్ తో సహా పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సినిమా లు ఈ సినిమా ను ఏ విధంగా ఆహ్వానిస్తాయి అనేది చూడాలి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదలవుతుందని సమ్మర్ కి సర్కారు వారి పాట షూటింగ్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ చిత్రం విడుదల పట్ల ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఏప్రిల్ నెలలో కూడా సాధ్యపడక పోతే ఆర్ఆర్ఆర్ సినిమా మే లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: