వైరల్ ట్విట్: RGV ఆ మజాకా.. బాధించే భార్యలందరినీ..!?

N.ANJI
రాంగోపాల్ వర్మ ఈ పేరే ఒక సెన్సెషనల్. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్‌జీవీ. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తుంటారు. డైరెక్ట్ గా ప్రశ్నించడంలో ఆర్‌జీవీకి తిరుగే లేదు. కొత్త కొత్త కోణాల్లో.. విభిన్న కథాశంతో తనకు నచ్చిన విధంగా సినిమాలు చేస్తూ క్రియేటర్‌గా నిలుస్తుంటారు. సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ అంతే దూకుడుగా వ్యవహరిస్తుంటారు. వివాదాలు ఎక్కడ ఉంటాయో.. రాంగోపాల్ వర్మ అన్నడ అన్నట్లు అర్థం. కావాలని వివాదాల్లోకి వెళ్తారా.. లేదా అతని నైజమే అంతనా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం. ఎలాంటి ఇష్యూ అయినా.. తనదైన శైలిలో స్పందించడం రాంగోపాల్ వర్మ ప్రత్యేకం. అలా రాంగోపాల్ వర్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.


శివాజీ సినిమాలో ఒక డైలాగ్ గుర్తు ఉండే ఉంటది.. ‘‘పందులే గుంపులు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది.’’ ఈ డైలాగ్ రాంగోపాల్ వర్మకు బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎవరని చూడకుండా.. ఎలాంటి భయం లేకుండా.. ముక్కుసూటిగా మాటలు విసరడంలో వర్మ స్టైల్ సపరేటు. ఎవరు ఏం అనుకున్నా ఐ డౌంట్ కేర్ అనడంలో రాంగోపాల్ వర్మ ప్రత్యేకం. పోలీస్ స్టేషన్‌లో కేసులను.. కోర్టు నుంచి నోటీసులను కూడా వర్మ పెద్దగా పట్టించుకున్నట్లు దాఖలాలు లేవు. వాటికి భయపడినట్లు కూడా కనిపించలేదు. ఎలాంటి కంటెంట్ మీదైనా ధైర్యంగా సినిమా తీయాలంటే అది కేవలం వర్మకే సాధ్యం. సొసైటీలో జరిగే సమస్యలపై ఎల్లప్పుడూ స్పందిస్తూ ఉంటారు. వర్మ స్పందన కోసం నెటిజన్లు కూడా ఎంతగానో వేచి చూస్తుంటారు. అయితే తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. మళ్లీ సెన్సెషనల్ అయ్యారు.
జనవరి 1న ఆయన ట్విట్టర్‌లో ఒక ట్విట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ కోరికలు అనేవి జీరో ఖర్చుతో వస్తాయి. అందుకే నేను నిరాడంబరంగా ఉండాలని అనుకోవడం లేదు. న్యూ ఇయర్ వేళ మీ అందరికీ 20 వేల టన్నుల బంగారాన్ని, అంబానీ కంటే పెద్ద ఇల్లుని, ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే భర్తలను బాధించే భార్యలు విడిచి వెళ్లిపోవాలి.. మీకు నచ్చిన హీరోయిన్లు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి.’’ అంటూ తన దైన శైలిలో ట్విట్ చేశారు. అలా మరోసారి రాంగోపాల్ వర్మ నెట్టింట వైరల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: