షాకింగ్: RRR వాయిదా వెనుక ఇంత కథుందా..??

N.ANJI
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతీసారి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 7వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా మళ్లీ ఏప్రిల్‌కు వాయిదా పడింది. అయితే ఏప్రిల్‌లో ఏ డేట్‌కి మూవీ రిలీజ్ అవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సమ్మర్ రేసులో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం. సినిమా వాయిదా పడటంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశ పడిపోయారు. వాస్తవానికి సినిమా యూనిట్ కూడా సినిమా విడుదలపై ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు. కానీ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ కూడా నిరాశకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాను దాదాపు రూ.40 కోట్లు పెట్టి  ప్రమోషన్ చేసుకుంటూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈవెంట్స్‌ లలో పాల్గొంటున్నారు. సినిమా వాయిదా పడటంతో అందరికీ షాకింగ్ న్యూస్‌గా మారింది. అయితే.. సినిమా వాయిదా పడటానికి రీజన్.. ఆయా రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభించడమే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు కట్టడి చేయడానికి ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేసి.. లాస్ అవడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంతోపాటు సినిమా రిలీజ్ కాకపోవడానికి మరికొన్ని రీజన్స్ ఉన్నాయి.
ఇప్పటికే అమెరికా వంటి అగ్ర దేశంలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. దాదాపు 2.5 మిలియన్ విలువ చేసే టికెట్స్ అమ్ముడయ్యాయి. వైరస్ వ్యాప్తి వల్ల అనుకూలమైన వాతావరణం కాదని సినిమా పోస్ట్ పోన్ చేశారు. అలాగే ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గాయి. దీంతో నిర్మాత దానయ్యను డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 40 పర్సెంట్ డిస్కౌంట్ అడిగారంట. తమిళనాడులో కూడా 50 పర్సెంట్ ఆక్యపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. అక్కడి బయ్యర్లు కూడా డిస్కౌంట్ అడిగినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేసినా.. నష్టపోయే ప్రమాదం ఉందని మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: