ఆ హీరోని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు : దిల్ రాజు

praveen
ప్రస్తుతం థియేటర్లు తెరుచుకోవడం తో వరసగా సినిమాలు విడుదలతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరూ కూడా థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం అర్జున పాల్గుణ. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దిల్ రాజు.. హీరో శ్రీ విష్ణు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 హీరో శ్రీ విష్ణు ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు అంటూ దిల్ రాజు అన్నాడు. హీరో అనాలా లేకపోతే ఆర్టిస్టు అనాలా తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు అతడిని ఎప్పుడో ఒకసారి పెద్దవాడిని చేస్తాయి. ఇప్పుడు వరకు అతను ప్రయత్నాలు ఆపకుండా ముందుకు సాగాలి అంటూ దిల్ రాజు అన్నాడు. నా దగ్గరికి ఎవరైనా కొత్త దర్శకులు వచ్చి కథ వినిపించినప్పుడు వాటిలో రెండు మూడు కథలను హీరో శ్రీ విష్ణు కి  పంపిస్తూ ఉంటాను అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కొత్త దర్శకుల పై నమ్మకం ఉంచి సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లని  అభినందించారు స్టార్ నిర్మాత దిల్ రాజు.



 ఈ క్రమంలోనే ఈ సందర్భంగా మాట్లాడిన సినిమా దర్శకుడు తేజ మార్ని.. కొత్త దర్శకుడి అయినప్పటికీ తనపై నమ్మకం ఉంచి శ్రీ విష్ణు తనకు మంచి అవకాశాన్ని కల్పించారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ నటిస్తోంది. ఈ సినిమాని నిరంజన్రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తు ఉండటం గమనార్హం. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎంతలా  ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: