ఈ సంవత్సరం చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా వారిలో సమంత , నాగచైతన్య మొదలుకొని అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా ఉన్నారు. ఇకపోతే ఎవరెవరు ఈ ఏడాది వివాహబంధానికి దూరమయ్యారో మనం ఒకసారి తెలుసుకుందాం..
1. సమంత - నాగ చైతన్య:
అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు. 2017లో గోవాలో గ్రాండ్ గా వివాహం జరిగింది. ఇక దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్ 2వ తేదీన వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు..
2. అమీర్ ఖాన్ - కిరణ్ రావు:
దాదాపు పెళ్లయిన 15 సంవత్సరాల తర్వాత జూలై 3వ తేదీన వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు సంయుక్తంగా అధికార ప్రకటన చేశారు. వీరిద్దరూ తమ జీవితాలకు విడాకులు అనే పదం ముగింపు కాదని.. కొత్త ప్రయాణానికి నాంది పలుకుతున్నాము.. అని తమ కొడుకు ఆజాద్ కు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులుగా చేదోడువాదోడుగా ఉంటామని తెలిపింది ఈ జంట.
3. ఇమ్మాన్ - మోనికా రిచర్డ్ :
విశ్వాసం సినిమా కి జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ తమిళ్ మ్యూజిక్ దర్శకుడు కూడా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇకపోతే 2020 నవంబర్లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా.. నిన్న మా జీవితానికి ఉన్న బంధం వీడిపోయింది అంటూ వెల్లడించాడు. ఇకపోతే 13 సంవత్సరాల పాటు కలిసిమెలిసి వున్న వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
4. సుస్మితాసేన్ - రో హ్మన్ షాల్:
2018లో వివాహబంధంతో ఒక్కటైన వీరు డిసెంబర్ 23 ఈ ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు..
ఇక వీరే కాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ - మరియా శ్రీవర్, హనీ సింగ్ - షాలినీ సింగ్ , నిషా రావల్ - కరణ్ మెహ్, కీర్తి కుల్హరి - సాహిల్ సెహగల్, వివియన్ ద్సేనా - వహ్బిజ్ దొరాబ్జీ వీరందరూ కూడా ఎటువంటి కారణాలు లేకుండా విడిపోవడం గమనార్హం.