రాదే శ్యామ్ నుండి మరో క్రేజీ అప్డేట్..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు, ఆ తర్వాత కూడా ప్రభాస్ వరుస పాన్  ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు, అయితే ఈ క్రమంలో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాదే శ్యామ్, ఈ  సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ఎన్నో అంచనాలను కలిగి ఉన్న ఈ సినిమా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.  

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్రం బ్రదర్ ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది, అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భారీ ఎత్తులో పూర్తి చేశారు, ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటికే రాదే శ్యామ్ సినిమా నుండి కొన్ని సాంగ్స్ ని చిత్ర బృందం విడుదల చేసింది, ఈ సాంగ్స్ కి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్ర బృందం మరో సాంగ్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, ఈ సాంగ్ ని సౌత్ ఆడియన్స్ కోసం న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: