ఇక హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన అందం అభినయంతో ఎంతో ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.బుల్లితెరపైన మంచి హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. తరువాత నటిగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకొని ఫాలోవర్స్ ని పెంచుకుంది.ఇక ఈ క్రమంలో 'క్షణం', 'రంగస్థలం' లాంటి హిట్ సినిమాల్లో నటించింది.ఇక ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ 'పుష్ప' సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో కనిపించి మెప్పించింది.మొదటి పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ తనపై వస్తోన్న ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించడం జరిగింది.ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె యూట్యూబ్ లో చాలా అసభ్యకరమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటూ ఆ బ్యాచ్ పై మండిపడింది.
ఇక ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్‌నెయిల్స్ చూశానని.. 'అనసూయ ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు' ఇలాంటి చెత్త థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటూ అనసూయ మండిపడింది. ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దని అనుకుంటాను కానీ.. అన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయని అనసూయ చెప్పింది. ఇక బరువు పెరగడం.. లేదా తగ్గడం అనేది తన ఇష్టమని అనసూయ చెప్పింది.మరి ఇంతలా దిగజారి అవతలి వ్యక్తి గురించి ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఎలా పెడతారంటూ అనసూయ ప్రశ్నించింది. 'నేను కూడా మీలాగా మాట్లాడగలను.. మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే చేయగలను.. కానీ అది నా వ్యక్తిత్వం కాదు' అంటూ అనసూయ చురకలంటించింది అనసూయ. ఇక ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి