వైసిపి నేతలకు టార్గెట్ గా మారిన హీరో.. వైరల్ ...

Satvika
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో ఏదేదో మాట్లాడుతున్నారు.  భారీగా నష్టాలను చూసిన తెలుగు పరిశ్రమ ఇప్పుడీ ప్పుడే పుంజుకుంది.. వరుస సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఇప్పుడు జోరుగా ఉంది. మొన్నటివరకూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎపి లో సినిమాలకు పెద్దగా ఆదరణ లేదు. ఇప్పుడు వున్న పరిస్థితులు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.. టిక్కెట్ ధరలు తగ్గింపు వ్యవహారం అనేక చర్చలకు దారి తీసాయి.

ప్రస్తుతం ఎపిలో సుమారు 170కిపైగా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే..వున్న వాటికి పరిమితులు అంటూ తక్కువ ధరలకె టికెట్లు అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చిత్ర పరిశ్రమ భారీగా నష్టాలను ఎదుర్క్కొవాల్సి ఉంటుంది. అంటూ చాలా మంది ప్రముఖులు చర్చించారు.. కానీ ఎపి సర్కారు మాత్రం ఎక్కడా కరగలెదు.. ఈ విషయం పై హీరో నాని స్పందించారు.అధికార యంత్రాంగం థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు డైలామాలో పడ్డారు. ఇక థియెటర్స్ నడపడం చాలా కష్టం అని భావించారు.

శ్యామ్ సింగ రాయ్‌, పుష్ప, అఖండ బిజినెస్‌పై ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు అడియాసలే మిగిలిపోయాయి. ఏపీలో థియేటర్లు మూతపడటంతో తన హృదయం బద్టలైందని కామెంట్ చేశాడు హీరో నిఖిల్..తెలుగు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎగ్జిబిటర్లు అప్‌సెట్ అయి థియేటర్లు మూసుకున్నారని, కొందరు మాత్రం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో థియేటర్లు నిర్వహిస్తున్నారని అన్నాడు. పన్నులు అంటూ ఏదేదో చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సినీ పరిశ్రమ చిన్నాభిన్నం అవుతుందని నిఖిల్ ఆరొపించారు. ఈ మాటలతో నిఖిల్ టార్గెట్ అయ్యారు..ఇక ఇతని పై వైసిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: