బాలివుడ్ క్వీన్ హీరోయిన్ కత్రినా పేరు ఇప్పుడు అందరికీ తెలుసు.. మొన్నామధ్య తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. పెళ్ళై కనీసం నెల కూడా కాక ముందే కట్టుకున్న మొగుడును పక్కన పెట్టింది. ఇప్పుడు వరుస సినిమాల లో నటించడం కోసం సినిమా అవకాశాలను వెతికే పనిలో అమ్మడు నిమగ్నమై ఉంది. ఆమె ఫ్యాన్స్ కు అది గుడ్ న్యూస్ అయిన అత్తింటి వాళ్ళకు ఇది షాక్ అనే చెప్పాలి. అచ్చటా ముచ్చటా తీరక ముందే ఆమె సినిమాలకు ఒకే చెప్పడం కాస్త కోపాన్ని తెప్పిస్తుంది..
ఇకపోతే తమిళ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్‌గా అటు తమిళం తో పాటు తెలుగు లోనూ హిట్ సినిమాలను అందిస్తున్నాడు. కొత్త పెళ్ళి కూతురు కత్రినా, విజయ్ సేతుపతి ఇప్పుడు కలిసి నటించ బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ సినిమా పేరు 'మేరీ క్రిస్మస్'. గతంలో 'ఏజెంట్ వినోద్', 'బద్లాపూర్', 'అంధాదూన్' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం లో రూపొందుతుంది..
క్రిస్మస్ ను పురష్కరించుకొని భర్త తో కలిసి జరుపుకున్న మొదటి పండుగ అని సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో ఫోటోలను షేర్ చేసింది. అవి నెట్టింట చక్కర్లు కోడుతుంది..ఇది ఇలా ఉండగా.. విజయ్ సేతుపతితో పాటు దర్శకనిర్మాతలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న క్యాట్.. 'దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.రమేశ్ తరౌణి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో ముంబాయి లో షూటింగ్ ప్రారంభం కానుంది.వచ్చే ఏడాది క్రిష్మస్ కానుకగా డిసెంబర్ 23 న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.. ప్లానింగ్ అంటే ఇదే సినిమా ఎలా ఉంటుందో చూడాలి..