తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టేజ్ పైన బ్రహ్మాస్త్ర సినిమా టీం కూడా సందడి చేశారు. రణ్ బీర్ కపూర్ హీరోగా.. ఆలియాభట్ హీరోయిన్ గా కరణ్ జోహార్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. 2022 సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే కి హాజరైన అలియా భట్, రణ్ బీర్ కపూర్ , దర్శకుడు రాజమౌళి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ లతో సందడి చేశారు. ఇకపోతే బ్రహ్మస్త్ర వీడియో క్లిప్ వేయగా అందరినీ బాగా అలరించింది.
ఇక హౌస్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్ లతో బ్రహ్మస్త్ర టీం.. బ్రహ్మాస్త్ర అనే గేమ్ ఆడించారు.. ఒకటి గుండ్రంగా ఉండే ఒక వస్తువును చేతిలో పెట్టుకొని మీలో ఉన్న పవర్ ఏంటో చెప్పమని.. అది నచ్చితే ఆ బ్రహ్మాస్త్రం మీకే ఇచ్చేస్తానని రాజమౌళి చెబుతాడు. అయితే మీరు చెప్తే మీలో ఉన్న పవర్ నాకు నచ్చాలి అప్పుడే బ్రహ్మాస్త్రాన్ని మీకు సొంతం చేస్తాను అని వివరిస్తాడు. ఇక సన్నీతో మొదలుపెట్టగా ప్రతి ఒక్కరూ తమ లో ఉన్న పవర్ ఏంటో చెప్పేస్తారు.. కానీ చివర్లో రాజమౌళి ఆ బ్రహ్మాస్త్రాన్ని సాయి మానస్ కి ఇచ్చేస్తారు.
అయితే రాజమౌళి మెచ్చి సాయి మానస్ కు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వడానికి సాయి మానస్ అంతలా ఏం చెప్పాడు అనే విషయానికి వస్తే.. మానస్ మాట్లాడుతూ.. నాకు తెలిసీ.. నాలో ఉన్న పవర్ ఏమిటంటే ఏ సిట్యుయేషన్ లో అయినా సరే చాలా సైలెంట్ గా ఉండి.. సిచువేషన్ ని అర్థం చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాను. అదే నాలో ఉన్న సూపర్ పవర్ అని చెప్తాడు.ఇక రాజమౌళికి ఈ సమాధానం నచ్చడం తో సాయి మానస్ కు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చేస్తారు.