నెట్టింట్లో వైరల్ అవుతున్న తమన్నా హాట్ ఫిక్స్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి  క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే వరస సినిమాల్లో నటించిన  మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమన్నా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇలా సినిమా లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తమన్నా తెలుగు లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను ఇతర విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా మిల్కీ బ్యూటీ తమన్నా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ ఆ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి, ఈ ఫోటోలలో తమన్నా హాట్ ఎద అందాలు పోకస్ అవుతున్నాయి, ఈ ఫోటో లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: