పుష్ప : ఆ సౌండేట్రా..ఆ స్టామినా ఏట్రా...అడ్డడ్డే తగ్గేదేలే!
ఆర్య సినిమాలో ఉండే లాజిక్కులు
ఆర్య 2 లో ఉండే లాజిక్కులు కలిపి చూస్తే
సినిమా అనే ఓ పెద్ద మానియాలో అవన్నీ
చాలా గొప్పగా వర్కౌట్ అయ్యాయి
కేవలం తన తెలివితో సినిమా స్థాయిని పెంచే రైటర్ సుక్కూ
తన ఎనర్జీ లెవెల్స్ తో సినిమా స్థాయిని ఇంకాస్త పెంచే ఆర్టిస్ట్ బన్నీ
నిన్నటిదాకా హీరో ఇప్పుడు యాక్టర్
ముందు నుంచి ఈ సినిమాపై మంచి హైప్ ఉంది.. మార్కెట్ బాగుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయీ వెనక్కు రానుంది. అందులో డౌటే లేదు. 180 కోట్ల రూపాయలు ఒక్క మొదటి భాగానికే వెచ్చించారంటే ఆశ్చర్య పోవాల్సిందే! బన్నీ కెరియర్లో ఇంత ఖర్చు పెట్టి తీసినా సినిమా ఇంతకుముందు లేదు. ఇకపై ఆ స్థాయి ఉంటుందో ఉండదో కూడా చెప్పలేం. ప్రభుత్వాల తిక్కలమారి నిర్ణయాల కారణంగా ఇవాళ సినిమా జీవితం అన్నది ఎలా ఉంటుందో ఎలా ముగిసిపోతుందో కూడా చెప్పలేం కనుక ఇప్పటికీ బన్నీ కెరియర్ ద బెస్ట్ మూవీ ఇదే అని చెప్పవచ్చు.. నో డౌట్ ఇన్ ఇట్.
స్ట్రాంగ్ క్యారెక్టర్
అంతకుమించి పవర్ ఫుల్ డైలాగ్
ఈ రెండూ పవర్ ప్యాక్ కాంబోలో
రూపొందిన సినిమా పుష్ప
పుష్ప ద రైజ్ సినిమా విడుదలతో ఇండస్ట్రీ అటెన్షన్ అంతా అటు వైపే ఉంది. మామూలుగా కాదు చాలా ఎక్కువ ఆసక్తితోనే ఈ సినిమా గురించి చాలా మంది నిరీక్షిస్తున్నారు. మోస్ ఎవైటింగ్ మూవీ అనేందుకు మంచి ఉదాహరణ పుష్ప. సినిమాకు సంబంధిం చి అన్ని చోట్ల నుంచి వస్తోన్న కామెంట్లు కానీ కాంప్లిమెంట్లు కానీ అదిరిపోయాయి. సుక్కూ తన దైన శైలిలో ఈ సినిమా ను రూపొందించారన్న టాక్ అయితే విపరీతంగా ఉంది. అదేవిధంగా ఈ సినిమాలో అన్నీ తానై నడిపిన బన్నీకి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయింది. ఆయన స్టామినా అదుర్స్ అని, ఆయన డెడికేషన్ అదుర్స్ అని అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.