ఆ సినిమా నాదే అంటూ మెగా హీరో కి షాక్..!!
ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా తీసుకొస్తామని చెప్పి..వివిధ కారణాల వల్ల డేట్ వాయిదా వేయాల్సి వచ్చిందట. అందుకే డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పి.. ఆ డేట్ ను కూడా వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమా తనది అని గీతా ఆర్ట్స్ వారు కాపీ కొట్టారు అని ఆస్ట్రేలియా దేశం లో ఉంటున్న వరంగల్ కు చెందిన ఒక యువకుడు ప్రదీప్ మడూరి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం ఈ కథను అల్లు బాబీకి వినిపించానని, కథ వారికి బాగా నచ్చడంతో సినిమా తీద్దామని హామీ కూడా ఇచ్చారని ప్రదీప్ ఆరోపిస్తున్నారు.. ఇక తన నుంచి స్క్రిప్ట్ తీసుకొని, తననే దూరం పెట్టారు అంటూ ఆయన చెబుతూ.. ఆధారాలను తీసుకుని మరీ కోర్టును కూడా ఆశ్రయిస్తాను అని అంటున్నాడు.
ఇకపోతే ప్రదీప్ మాడురి ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ నుండి సినిమాటోగ్రఫీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలకు అక్కడే సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అల్లు అరవింద్ టీమ్ ఏమీ చెబుతారో వేచి చూడాలి.A