బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!
ఈ చిత్రం యొక్క ఔట్ పుట్ పై యూనిట్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని టచ్ చేయడం అంటే రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సినిమా చేసిన తర్వాత రాజమౌళి సినిమాలను అన్ని కూడా బాలీవుడ్ ప్రేక్షకులు చూసేశారు. అందులోనూ టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చత్రపతి సినిమా చాలాసార్లు చూసే ఉంటారు. ఆ విషయం తెలిసి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం ఆయన గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను వెతికే పనిలో చిత్రబృందం ఉంది. పలు ఆసక్తికర టైటిల్స్ ను అనుకున్న తరువాత చివరికి చత్రపతి టైటిల్ న్ పెట్టాలని యూనిట్ నిర్ణయించుకుందట. టైటిల్ ఏదైనా కూడా అది నార్త్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. కనెక్ట్ కాకపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ లో సైతం అదే టెన్షన్ లో ఉందట. ఇక ఆయన చిత్రాలకు హిందీ యూట్యూబ్ లో బాగా వ్యూస్ వస్తున్నాయని చెప్పి ఈ విధంగా డైరెక్ట్ సినిమా చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది విమర్శకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేసి మంచి సినిమాలు చేయాలి కానీ ఇప్పుడే ఇతర భాషలలో సినిమాలు చేయడం ఎందుకు అని విమర్శిస్తున్నారు.