టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. 'అలా మొదలైంది' అనే సినిమాతో వెండితెరపై ఆరంగేట్రం చేసిన ఈ భామ తక్కువ సమయంలోనే హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అలనాటి సౌందర్య తర్వాత సౌందర్య అనే పేరు తెచ్చుకొని గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నే కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి, వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇక తాజాగా నిర్మాతగా కూడా మారి ఇటీవల విడుదలైన 'స్కైలాబ్' సినిమాను నిర్మించింది.
ఈ సినిమాలో ఆమె ఓ హీరోయిన్ గా కూడా నటించింది. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న నిత్యా మీనన్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కున్న కొన్ని చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇక తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ మాట్లాడుతూ..' కొంతమంది జర్నలిస్టులు తనపై లేనిపోని వార్తలు వ్రాసారని, వాటిని చూసి చాలా కృంగిపోయా అని చెప్పింది. అలా మొదలైంది సినిమా విడుదలైన తర్వాత నేను ఓ ఇంటర్వ్యూ కి వెళ్లాను. ఆ ఇంటర్వ్యూలో నన్ను ప్రభాస్ గారి గురించి అడిగారు.
ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని నేను అనగానే వాళ్లందరూ షాక్ అయి.. నన్ను ఆట పట్టించారు. అల్లరి చేశారు. ఇంత చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తూ ఓ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా రాశాడు. నా గురించి ఆ జర్నలిస్ట్ తప్పుగా రాయడం తో అది చూసి నేను చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కృంగిపోయాను, అంటూ చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. ఇక నిజానికి ఆ సమయంలో నిత్యామీనన్ పై చాలా మంది అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎంతో వైరల్గా మారాయి...!!