ఆర్. ఆర్. ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి...!

murali krishna
రాజమౌళి విజయ రహస్యం తెలుసుకోవాలని ప్రతి సినిమా వాడికి ఆశ ఉంటుందట.. కానీ, తన విజయ్ రహస్యం పై అసలు రాజమౌళి మరోలా మాట్లాడాడట.

రాజమౌళి మాటల్లోనే.. 'నేనెప్పుడూ విజయం సాధించానని భావించలేదని ప్రతి చిత్రాన్ని నా మొదటి ప్రాజెక్ట్‌లానే అనుకుంటానని మెయిన్ గా నేను ఏదైతే కథ అనుకుంటానో ఆ కథకు తగ్గట్టు హీరోహీరోయిన్లను ఎంచుకుంటానని చెప్పాడట.


ఒకవిధంగా అదే నా బలం కూడా. ఈ సినిమా విషయానికొస్తే కొమురం భీంగా ఎన్టీఆర్ మాత్రమే బాగా చేయగలడని అలాగే అల్లూరి సీతారామరాజుగా చరణ్ బాగా సూట్ అవుతాడని ఇలా నేను నా పాత్రల కోసం సరైన నటులను ఎంచుకుని సినిమా చేస్తానని అప్పుడు సహజంగానే సినిమా బాగా వస్తోంది అంటూ రాజమౌళి తాజాగా కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడట.

అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడట.ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడుగుతూ.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని కన్నడలో డబ్బింగ్‌ చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ? అని అడిగాడట.. అయితే, రాజమౌళి 'బాహుబలి' గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను నేను కేవలం తెలుగు, తమిళంలోనే షూట్ చేశాననని .

ఇక హిందీ, మలయాళంలో డబ్‌ చేశామని చెప్పాడట.. అయితే బాహుబలిని కన్నడలో డబ్‌ చేయలేదని నన్ను అప్పుడు చాలామంది తిట్టారట.నా పై ఆ సమయంలో కన్నడ సోషల్‌మీడియాలో బాగా నెగెటివ్‌ గా మాట్లాడారని 'నువ్వు అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చి.. మా కన్నడ వాళ్లని మాత్రం చులకనగా చూస్తావా ? అంటూ సీరియస్ అయ్యారు అని రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడట .

అలాగే రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. 'నిజానికి నేను బాహుబలిని కన్నడలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశానని కానీ ఆ సమయంలో కన్నడలో ఉన్న రూల్స్‌ ప్రకారమే మేము అప్పుడు 'బాహుబలి'ని డబ్‌ చేయలేకపోయామని కాకపోతే అదృష్టం బాగుండి ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని మాత్రం కన్నడలో డబ్‌ చేసే అవకాశం వచ్చింది' అని జక్కన్న చెప్పుకొచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: