వామ్మో..ఈ షార్ట్ ఫిలింకి 900 అవార్డులు వచ్చాయట..!

Divya
ఏదైనా సినిమా ఆస్కార్ ఫిలిమ్ అవార్డు సాధించింద అంటే అంతకన్నా మించిన ఫలితం లేదని చెప్పవచ్చు. ఈ అవార్డు కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతూ కష్టపడుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్ నిర్మించే వాళ్ళు కూడా ఇలానే కష్టపడుతున్నారు. అలా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ నిర్మించినప్పటికీ.. తాజాగా ఇప్పుడు ఒక తెలుగు షార్ట్ ఫిలిం త్వరలోనే ఆస్కార్ పోటీలో నిలవనుంది. ఆ షార్ట్ ఫిలిం పేరే ‘మనసానమః ఈ షార్ట్ ఫిలిమ్ గత సంవత్సరం.. యూట్యూబ్ ఛానల్ లో బాగా స్ట్రీమింగ్ అయ్యింది.
దీంతో ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. విరాజ్ అశ్విన్, ముఖ్య పాత్రలో.. దీపక్ రెడ్డి తెరకెక్కించిన ‘మనసానమః. ఇక ఇందులో దృషిక చందర్, పృద్వి శర్మ, శ్రీవల్లి ఇతరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిలిం ఇప్పటివరకు 900  జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా సాధించింది. కొన్ని వేలకు పైగా చిత్రోత్సవాలు ఇది ప్రదర్శించబడింది. అయితే ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డులు నిలవడానికి సిద్ధమైంది.
అందుకోసం క్వాలిఫై లో ఉన్న ఈ షార్ట్ ఫిలిం 10వ తేదీన ఓటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో విజయకేతనం ఎగరేసిన ఇక ఆస్కార్ బరిలో నిలిచినట్లే. ఇక ఇందులో అంతగా ప్రదర్శించడానికి ముఖ్య కారణం రివర్స్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కథని తెరకెక్కించడం. అంతే కాకుండా మ్యూజిక్ పరంగా బాగా  వర్కౌట్ అయిందని చెప్పవచ్చు.
స్టొరీ మొత్తాన్ని రివర్స్ లోనే ప్రదర్శించడం వల్ల.. ప్రేక్షకులు ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నంతసేపు మంచి అనుభూతి దక్కించుకున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ వోటింగ్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనే విషయం అతి త్వరలోనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నెల 10 వ తేదీన జరగబోయే ఓటింగ్లో.. కచ్చితంగా విజయకేతనం ఎగర వేస్తుందని చిత్రబృందం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: