రామారావు ఆన్ డ్యూటీ లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఆరంభం లోనే గోపిచంద్ మలినేని దర్శకత్వం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన క్రాక్ సినిమా తో బాక్సాఫీసు దగ్గర అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, అదే జోష్ ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం రవితేజ వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు, అలా రవితేజ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ, ఈ సినిమా లో రవితేజ ఒక పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్ర లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమా ప్రారంభించి చాలా రోజులే అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్ లు ఏవీ పెద్దగా బయటకు రాలేదు. అయితే తాజా గా ఈ సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం బయటికి వదిలింది, ఇష్యూయింగ్ ఆర్డర్స్.. రేపు ఉదయం పదిగంటల ఎనిమిది నిమిషాలకు అంటూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను బయటకు వదిలింది.

కాకపోతే రేపు ఏ అప్డేట్ ను విడుదల చేస్తారా? అనేది మాత్రం చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు, దీనితో రేపు టీజర్ విడుదల గురించి ప్రకటన చేస్తారా లేక మరేదైనా ప్రకటనను చిత్ర బృందం చేస్తారా అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయిక గా నటిస్తోంది. మలయాళ నటి రజిషా విజయన్ కూడా ఈ యాక్షన్ డ్రామా లో భాగం కానుంది. రాజిషా కు తెలుగు లో ఇదే మొదటి సినిమా. సుధాకర్ చెరుకూరి నిర్మాత గా రూపొందుతున్న ఈ సినిమా కి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ని రవితేజ సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ తెరకెక్కిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కు నిర్మాత గా ఇదే తొలి సినిమా కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: